
హైదరాబాద్, ప్రతినిధి: టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోల్లో జగపతిబాబు ఒకడు. హీరోగా దాదాపు అన్ని రకాల సినిమాల్లో యాక్ట్ చేసిన జగపతి బాబు,రీసెంట్ గా విలన్ గా మారాడు. బాలకృష్ణ లెజెండ్ లో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన జగపతి, రజినీకాంత్ ‘లింగ’లో కూడా విలన్ గా యాక్ట్ చేశాడు. లేటెస్ట్ గా మరో స్టార్ హీరో సినిమాలో తండ్రి పాత్రలో నటిస్తున్నాడు జగపతి బాబు.
మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ తండ్రిగా జగపతి బాబు యాక్ట్ చేయనున్నాడని టాక్. మహేష్-జగపతి ల మధ్య జరిగే సీన్లు ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంటాయని చెప్తున్నారు. శృతి హాసన్ హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది.