మహేశ్ కొత్త సినిమా కబుర్లు..

హైదరాబాద్, ప్రతినిధి : మహేశ్ తన కొత్త సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కేరళలోని పొల్లాచ్చిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ అనంతరం మహేశ్ పై రెండు పాటలను ఫ్రాన్స్ లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. మార్చిలో మహేశ్, శృతిహాసన్ జంటపై తీసే ఈ పాటలకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

వేసవిలో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్ బాబుతో పాటు రాజేంద్రప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం, ముఖేష్ రుషి, సంపత్, సుబ్బరాజు, తులసి నటిస్తున్నారు. చిత్రానికి కథ, మాటలను దర్శకుడు శివ నే అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ , సి.వి మోహన్ నిర్మిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *