
అందరి హృదయాలను తాకే సినిమా ఇదీ.. ఇలాంటి కథను చేయడానికి గట్స్ కావాలి.. అలాంటి కథను నమ్మి సినిమాతీయడానికి ఒప్పుకున్న మహేశ్ గొప్పతనం మాటల్లో చెప్పలేనిదన్నారు కొరటాల శివ. శ్రీమంతుడు విడుదలై సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నసందర్భంగా చిత్రం యూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టింది. కార్యక్రమంలో దర్శకుడు శివ, నిర్మాత, హీరోయిన్ శృతిహాసన్, జగపతి బాబులు పాల్గొని మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు.