మహిళా సాధికారిత దిశగా ప్రభుత్వం అడుగులు: మంత్రి మహేందర్ రెడ్డి

మహిళా సాధికారిత దిశగా ప్రభుత్వం అడుగులు: మంత్రి మహేందర్ రెడ్డి

మహిళా సాధికారిత దిశగా ప్రభుత్వం అడుగులు

స్త్రీ చైతన్యం సమాజ వికాసానికి దోహదం

రాష్ట్రాభివృద్ధికి ప్రవాసులు సహకరించాలి

5 కే రన్ లో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 23 : మహిళా వికాసం కోసం తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, స్త్రీ చైతన్యం సమాజ వికాసానికి దోహదం చేస్తుందని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. శనివారం మహిళా సాధికారిత మీద తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్, అమెరికన్ తెలుగు అసోషియేషన్ ఆధ్వర్యంలో నక్లెస్ రోడ్డు లో నిర్వహించిన 5 కే రన్ ను ఆయన మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి,ఆటా అధ్యక్షడు ఆశీరెడ్డి కరుణాకర్ రెడ్డి, భీరంరెడ్డి తదితరులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో జనాభాలో సగం ఉన్న మహిళలు అన్నిరంగాలలో రాణించాలని అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా వికాసానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మహిళా భాగస్వామ్యం అన్నిరంగాలలో ఉండాలని ఇటీవల జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చాటారన్నారు. విద్యా, ఉద్యోగ, పారిశ్రామిక రంగాలలో మహిళలకు తమ ప్రభుత్వం
గుర్తింపునిస్తూ ప్రోత్సహించటంతో పాటు మహిళా భద్రతకు షీ టీమ్స్ తో రక్షణ కలిగిస్తుందని అన్నారు.

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్, అమెరికన్ తెలుగు అసోషియేషన్ తదితర సంస్థలు, ఎన్ఆర్ఐలు రానున్నరోజుల్లో తెలుగు, తెలంగాణ సమాజం అభివృద్ధికి తమ సహాకరాం అందించాలని బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ తెలుగు సంఘాలు తెలంగాణ మహిళల సాధికారిత కోసం అవసరమైన సహాయం చేయాలని అన్నారు. ప్రతీ ఆదివారం మహిళలకు తమ విద్యా సంస్థలలో ఏరో బిక్స్ నిర్వహిస్తామని తెలిపారు.ఎన్ఆర్ఐలు రజనీ రెడ్డి, వివిధ విద్యాసంస్థల నిర్వహకులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్ధినులు, మహిళలు నిర్వహించిన ఏరోబిక్స్ అందరిని ఆకట్టు కోగా వేలాధి మంది విద్యార్థులు 5 కే రన్ లో ఉల్సాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు.

p mahender reddy     p mahender reddy 1     p mahender reddy 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *