
హైదరాబాద్, ప్రతినిధి : సమాజంలో మహిళలకు విశిష్ట స్థానం ఉందని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100శాతం కట్టుబడి ఉందని అన్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తూ కూడా ఇంటి వ్యవహారాలన్ని చక్కబెట్టుకోవడంలో మహిళల పాత్ర అమోఘమని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా నాయిని హామీ ఇచ్చారు.