మహారాష్ట్ర నుంచి వరంగల్ కు కరెంట్ లైన్

Electric power lines

కేంద్రం ప్రభుత్వం తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్రాలకు విద్యుత్ నందించేందుకు మరో భారీ పతకానికి శ్రీకారం చుట్టింది.. ఉత్తరాది భారత్ నుంచి ఇన్నాళ్లు కరెంట్ కొరత ఏర్పడితే సరఫరా చేసేందుకు సరైన విద్యుత్ లైన్లు తెలుగు రాష్ట్రాలకు లేవు. దీంతో గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సరఫరా కాక ఇబ్బందులు ఎదురయ్యేవి.. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంక పరిస్థితి చక్కదిద్దింది. ఇక మున్ముందు అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పెద్దదైన అతి భారీ ఖరీదైన విద్యుత్ లైన్ నిర్మాణానికి పూనుకుంది..

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా వరోరా నుంచి వరంగల్ వరకూ కొత్త విద్యుత్ లైన్ నిర్మాణానికి దాదాపు 9 వేల కోట్లను కేటాయించి కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యుత్ ఆర్థిక సంస్థ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. ఈ సంవత్సరంలోనే నిర్మాణం పూర్తయితే ఇక తెలంగాణకు ఉత్తర భారత్ నుంచి విద్యుత్ అంది మరింత కరెంట్ అందనుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *