Breaking News

మహానాడులో బాలయ్యను అడ్డుకున్న పోలీసులు

Balayya

హైదరాబాద్ లోని గండిపేట లో నిర్వహిస్తున్న టీడీపీ  మహానాడులో టీడీపీ ఎమ్మెల్యేలకు అవమానాలు ఎదురవతూనే ఉన్నాయి. మొదటిరోజే పోలీసులు ఎమ్మెల్యేలను వాహనాల ద్వారా లోపలికి అనుమతించలేదు. ఎమ్మెల్యే గౌతు శివాజీ, అశోక్ లను నిన్న అడ్డుకున్న పోలీసులు నేడు ఏకంగా లయన్ బాలకృష్ణనే ఆపేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును తప్ప వేరెవరినీ తాము లోపలికి నేరుగా అనుమతించమని.. నడుచుకుంటూ వెళ్లాలని పోలీసులు బాలయ్యను ఆపేశారు.

దీంతో ఉగ్రతాండవమైన బాలకృష్ణ పరుష పదజాలతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. చివరకు వేరే మార్గంలో బాలయ్యను పంపించేశారు. వీరినే కాదు.. కార్డులు తీసుకురాని ఎవరిని పోలీసులు లోపలకి అనుమతించకపోవడంతో టీడీపీ మహానాడులో అధినేత కు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు టీడీపీ తమ్ముళ్లు..

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *