
గణాలలోకెల్ల అధిపతి గణపతి.. వినాయకుడు.. దేవుళ్లందరికంటే ముందు ఆయనకే మనం పూజలు చేయాలి. అంతటి మహిమాన్విత స్వామి మన పూజలందుకోవడానికి 9 రోజుల పాటు మన చెంతనే ఉండి మన కోర్కెలు తీరుస్తాడు..
ఊరు వాడ,పల్లె పట్నం.. గణేష్ మండపాలతో సందడిగా మారింది.. చిన్న పేద్దా తేడా లేకుండా అందరూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు.
మహాగణపతి పూజల కోసం మార్కెట్ లో పత్రి, జాజికాయ, మేడిపండు, తంగెడు, అల్లనేరేడు,జాజి తదితర వస్తువులు కుప్పలుగా వచ్చిపడ్డాయి.. ఈసారి వినాయక విగ్రహాలకు ధరలు కూడా పెరిగిపోయాయి.. చాలా మంది ప్రకృతి ప్రియులు మట్టి విగ్రహాలనే ప్రతిష్టిస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదు..