మహాకూటమికి ఓటు అడిగే హక్కు లేదు

మహాకూటమికి ఓటు అడిగే హక్కు లేదు

తాజా మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్

మహాకూటమి నాయకులకు ఓటు అడిగే హక్కు లేదని తాజా మాజీ ఎమ్మెల్యే, ధర్మపురి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర అన్నారు. వెల్గటూర్ మండలం పాశిగాం గ్రామంలో ప్రచారం నిర్వంచారు. ఈ సందర్భంగా పలు పార్టీ ల నుంచి 23 మంది యూత్ సభ్యులు టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ధర్మపురిలో ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతవడం ఖాయమన్నారు. నియోజకవర్గంలోని సబ్బండ వర్గాలు తనకు మద్దతు తెలుపుతున్నాయని, భారీ మెజార్టీతో గెలిపిస్తాయని తెలిపారు. కుట వృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చిందని, అన్ని కుల సంఘాలు టీఆర్ఎస్ కు మద్దతుగా కదిలి వస్తున్నాయని అన్నారు. మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ సహకారంతో గోదావరి జలాలు తెప్పించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని తెలిపారు. టీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని, ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని,ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. తనను నమ్ముకున్న కుటుంబాలను తప్పకుండా ఆదుకుంటానని భరోసా కల్పించారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ప్రతీ ఒక్కరు కారు గుర్తుకే ఓటేయ్యాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *