
లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయంలో కలశ స్థాపన ద్వారా బోనాల ఉత్సవాలను ప్రారంభించిన జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తో కలిసి బోనాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజల నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ లో బోనాల పండగ నిర్వహణకు జిహెచ్ఎంసి ద్వారా రూ 25 కోట్లు కేటాయించారు. బోనాలు జరిగే ఆలయాల వద్ద రహదారుల నిర్మాణం మరమ్మత్తులు, ప్రత్యేక శానిటేషన్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.ప్రశాంతంగా బోనాల నిర్వహించడం ద్వారా హైదరాబాద్ నగర క్యాతిని మరింత పెంపొందించాలన్నారు జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్.