Breaking News

మళ్లీ కాళ్లు మొక్కిన కేసీఆర్

kcr pranab

సీఎం కేసీఆర్ తన స్వామి భక్తిని చాటుకున్నారు. మళ్లీ కృతజ్ఞతాపూర్వకంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాళ్లు మొక్కారు. రాష్ట్రపతి ప్రణబ్ నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శీతాకాల విడది నిమిత్తం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు వచ్చారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, సీఎస్ రాజీవ్ శర్మ మంత్రులు రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు..

ఈ సందర్భంగా తెలంగాణ బిల్లు ఆమోదంలో కీలక పాత్ర పోషించి బిల్లు ఆమోదింపచేసిన ప్రణబ్ పట్ల కేసీఆర్ ఆది నుంచి కృతజ్ఞత చాటుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే నిన్న ప్రణబ్ హైదరాబాద్ రాగానే ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *