
ముంబై, ప్రతినిధి : పీకే సినిమాతో మంచి బంపర్ హిట్ కొట్టిన అమీర్ ఖాన్ మరో కొత్త క్యారెక్టర్ ను చేయబోతున్నారు. త్రీ ఇడియట్స్ లో కాలేజ్ స్టూడెంట్ కేరక్టర్ అయినా, పీకే లో ఎలియన్ రోల్ అయినా అందరు మెచ్చేలా నటించాడు. కేరక్టర్ కు తగ్గట్లు ప్రిపేర్ అయ్యే అమీర్ త్వరలో మల్లయోధుడిగా యాక్ట్ చేయనున్నారు. ఇండియన్ రెజ్లింగ్ కోచ్ మహవీర్ ఫొగాట్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీతో మహవీర్ రోల్ లో అమీర్ నటిస్తుంచనున్నట్లు సమాచారం.
ఈ మూవీకి ‘దంగాల్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. మహవీర్ ఇద్దరు కూతుళ్లకు ఎలా ట్రైనింగ్ ఇచ్చాడు ? ఇంటర్నేషనల్ స్థాయికి వారిని ఎలా తీసుకెళ్లాడనేది మూవీలో చూపించనున్నారు. నితీష్ తివారి ఈ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.