Breaking News

మల్లన్నసాగర్ సొరంగం పనులను అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి హరీశ్ రావు

మల్లన్నసాగర్ సొరంగం పనులను అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి హరీశ్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇరుసు  మల్లన్న సాగర్

మల్లన్నసాగర్ తో 5 జిల్లాలకు గోదావరి.

రాత్రింబవళ్ళు  నిర్విరామంగా పనులు.

రెట్టింపు లేబర్ పెంచాలి.

యుద్ధప్రాతిపదికన పనులు.

కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ ఇరుసు లాంటిదని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన  ప్యాకేజ్ 12 పనులను ఆయన సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.మల్లన్న సాగర్ సొరంగం , పంప్ హౌస్ పనులను  మంత్రి హరీష్ రావు పరిశీలించారు. కీలకమైన మల్లన్న సాగర్ పనులు యుద్ధప్రాతిపదికన  పూర్తి చేయాలని ఆదేశించారు.రెట్టింపు స్థాయిలో లేబర్ ని పెంచాలని  ఇరిగేషన్ అధికారులను ఆయన కోరారు. ప్యాకేజ్ 12 కింద  మల్లన్న సాగర్  రిజర్వాయర్, కాలువల పనులు జరుతున్నాయి.సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ నుండి తొగుట మండలం తుక్కపూర్ వరకు  సొరంగం ,పంప్ హౌస్ పనులను పరిశీలించారు. మల్లన్నసాగర్  కాళేశ్వరం లో వ్యూహాత్మక ప్రదేశమని మంత్రి  అన్నారు.ఇది ఎత్తైన ప్రాంతంలో ఉందని అన్నారు.ఈ సొరంగం దాదాపు 17 కిలోమీటర్లు ఉండగా పనులు పూర్తి స్థాయిలో జరిగాయని తెలిపారు. ఇందులో  8 కిలోమీటర్లకు పైగా  సిమెంట్ లైనింగ్ పనులు పూర్తి అయినట్టు ఆయన చెప్పారు. రాత్రింబవళ్ళు  నిర్విరామంగా రెట్టింపు స్థాయిలో లేబర్ ను పెంచి పనులు సాగించాలని కోరారు. మల్లన్నసాగర్  ద్వారా 5జిల్లాలకు గోదావరి జలాలు అందనున్నట్టు ఇరిగేషన్ మంత్రి తెలిపారు.సిద్దిపేటజిల్లా కొండ పోచమ్మ సాగర్ , సిద్దిపేట ,దుబ్బాక ,గజ్వేల్ ,సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ వైపు ,యాదాద్రి జిల్లాలో గందమల్ల, బస్వాపూర్, నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ , మేడ్చెల్, రంగారెడ్డి జిల్లాల్లో షామీర్ పేటలో  దీని ఫలాలు అందనున్నాయని హరీశ్ రావు చెప్పారు.వారం పది రోజుల్లో పంప్ హౌస్ పనులు, సర్జ్ పూల్   గేట్లు పూర్తి కానున్నట్టు తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు 50 టీఎంసీల లతో నిర్మిస్తున్నట్టు చెప్పారు.ఒక వైపు  మల్లన్న సాగర్ రిజర్వాయర్ పనులు అవుతున్నప్పటికీ  మరో  వైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీరు ఈ సొరంగం ,పంప్ హౌస్ ద్వారా కాలువలకు మిగతా రిజర్వాయర్ లకు ,చెరువులు కుంటలకు నీరందించే  విధంగా పనులు జరుతున్నట్టు తెలిపారు. అత్యంత ఆధునిక  టెక్నాలజీ తో  విదేశాల నుంచి  మోటార్ లను తెప్పించి పనులు చేపడుతున్నట్టు తెలియజేశారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పని చేస్తున్న కార్మికులకు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.

harish rao 1 harish rao 2     harish rao 3     harish rao 4

ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మూడు షిఫ్టులలోనూ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.అన్నారం బ్యారేజీకి 66 , మేడిగడ్డ కు 86, సుందిళ్ళ బ్యారేజీకి 74  గేట్లను అమర్చవలసి ఉండగా  మంగళవారం నాటికి సుందిళ్ళ బ్యారేజీలో 20 గేట్లను బిగించారు.మిగతా రెండు బ్యారేజీలలోనూ గేట్ల బిగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది.కాళేశ్వరం కు సంబంధించిన బ్యారేజీలు, పంప్ హౌజ్ పనుల్లో 80 శాతం సిమెంటు కాంక్రీటు పనులు పూర్తయినట్టు మంత్రి హరీశ్ రావు వారం క్రితమే  ప్రకటించారు. మిగతా 20 శాతం పనులు మరో రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.అన్నారం-కన్నేపల్లి  మధ్య గ్రావిటీ కెనాల్ పనులు దాదాపు 80 శాతం పూర్తయినట్టు హరీశ్ రావు చెప్పారు. కాళేశ్వరం పనుల పురోగతిపై మంత్రి హరీశ్ రావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కన్నేపల్లి, మేడిగడ్డ, సుందిళ్ళ,అన్నారం  పంప్ హౌజ్ లకు అవసరమైన యంత్రాల   దిగుమతి  కార్యక్రమాలు సాగుతున్నట్టు  మంత్రి చెప్పారు.జపాన్, స్విట్జర్ల్యాండ్ , ఆస్ట్రియా వంటి దేశాల నుంచి ఈ యంత్ర సామాగ్రి  రవాణా అవుతున్నది.కన్నేపల్లి దగ్గర్ గోదావరి నుంచి అప్రోచ్ కెనాల్ , హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఫోర్ బే వరకు చేరిన నీటిని శక్తివంతమైన విద్యుత్ మోటార్ల ద్వారా ఎత్తి అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించనున్నారు.ఇందుకోసం కన్నేపల్లి పంపు హౌజ్ లో 17 మోటార్లు అమర్చుతున్నారు.నీటిని పంపింగ్ చేయడానికి గాను 5 మీటర్లు, 3.5 మీటర్ల వ్యాసార్ధం తో ఉన్న భారీ పైపులను నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.కన్నేపల్లి పంపు హౌజ్ నుంచి దాదాపు కిలోమీటరున్నర దూరం వరకు పైపుల ద్వారా నీటిని తరలించి అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీలోకి నీటిని నింపనున్నారు.కన్నేపల్లి-అన్నారం మధ్య అటవీ ప్రాంతంలో తలపెట్టిన  13.3  ఇర్రిగేషన్ మంత్రి  డెడ్ లైను విధించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ పనులు మరింత  ఊపందుకున్నాయి.విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ప్రాజెక్టు అవసరాలకు ప్రత్యేక విద్యుత్ లైన్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

harish rao 5 harish rao 6     harish rao 7     harish rao 9

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *