
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అవినీతిని సహించడని మరోసారి నిరూపించాడు.. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ అవినీతి కి పాల్పడిన తన సహచర కేబినెట్ మంత్రిని తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఢిల్లీ పర్యావరణ, ఆరోగ్య, శాఖ మంత్రి ఆసిమ్ అహ్మద్ ఖాన్ లంచం అడిగినందుకు ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నామని.. ఆయన స్థానంలో ఇమ్రాన్ హుస్సేన్ ను నియమిస్తున్నామని కేజ్రీవాల్ ప్రకటించారు.
మంత్రి లంచం తీసుకున్న సంభాషనల టేపులను మీడియాకు వినిపించారు. తన కొడుకు కానీ, ఉపముఖ్యమంత్రి మనీష్ గానీ అవినీతి కి పాల్పడినా వదిలేది లేదని తేల్చిచెప్పారు. గడిచిన ఎనిమిది నెలల్లో కేజ్రీవాల్ మంత్రివర్గం నుంచి ఆరుగురు సభ్యులు బయటకు వెళ్లడం గమనార్హం.