మాటల మాంత్రికుడు, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ నందించిన దర్శకుడు త్రివిక్రమ్ ఈసారి మంచి ప్రేమకథతో వస్తున్నాడు. లవర్ బాయ్ నితిన్ హీరోగా.. సమంత హీరోయిన్ గా నటిస్తున్న కొత్త చిత్రం ‘అ ఆ’ ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఆద్యంతం ప్రేమ కథా చిత్రంగా వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ లోనే అదరగొట్టింది.
ట్రైన్ లో నితిన్, సమంత పరిచయ కార్యక్రమంతో విడుదలైన ఈ టీజర్ లో సమంతనే ఎక్కవ సేపు చూపించారు. సమంత అందచందాలతో ఈ సినిమాను లాగించినట్టు తెలుస్తోంది. అంతేకాదు పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో కోనసీమ అందాలు కనువిందుచేసేలా సెట్ లు ఉన్నాయి.. కాగా త్రివిక్రమ్ సినిమాకు తొలిసారి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండడడం విశేషం. ప్రేమ పాటలకు పెట్టింది పైరా మిక్కీ త్రివిక్రమ్ తో ఎప్పుడు పనిచేసిన దేవీశ్రీని కాదని ఈ సినిమాకు పెట్టుకోవడంతో ఈ సినిమా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని అర్థమవుతోంది.. మీరూ చూడండి అఆ ట్రైలర్ ను పైన వీడియోలో..