
చైన్నై, ప్రతినిధి: సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న విక్రమ్ హీరోగా రానున్న ‘ఐ’ మూవీ ప్రచారం ఊపందుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో తమిళంలో మరో ట్రైలర్‌ని డైరెక్టర్ శంకర్ రిలీజ్ చేశాడు. విడుదల చేసిన కొద్దిగంటలకే దాదాపు ఐదున్నర లక్షల హిట్స్ వచ్చాయి.
భారీ అంచనాలతో వస్తున్న ఈ ఐ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి.. ఈ సినిమాను వేలంలో కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. గతంలో వచ్చిన టీజర్లో కొన్ని సీన్లు కలిపి లేటెస్ట్గా రిలీజ్ చేశాడు. సాంగ్స్, ఫైట్స్, యాక్షన్ మాత్రమే చూపించాడు. కాకపోతే హీరోయిన్ మేకప్, ఆమెకు సంబంధించిన డైలాగ్స్ వున్నాయి. చిన్న డైలాగ్‌తో విక్రమ్ సరిపెట్టుకున్నాడు. ట్రైలర్ చాలా రిచ్‌గా వుంది. గ్రాఫిక్స్‌ని భారీగానే వినియోగించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన తొలి టీజర్ రికార్డు స్థాయిలో హిట్స్ రాగా, ఈ ట్రైలర్ ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.