మన హక్కుల కోసం నినదించండి..

ఈ సమాజంలో అందరి ఆకాంక్షలకు మనమే (జర్నలిస్టులు, మీడియానే) గొంతుకమైతాం.. అందరి ఆక్రందనలను ప్రపంచానికి చాటిచెబుతాం.. అనార్థులకు సాయమందేలా అధికారుల్లో చలనం తెస్తాం.. పీడిత తాడిత , కార్మిక, కర్షక గొంతుకై నినదిస్తాం.. కానీ మనలోనే ఐక్యత లేదు. సంవత్సరాలుగా ప్రైవేటు యాజమాన్యాల కబంధ హస్తాల్లో జర్నలిస్టులు చిక్కిశల్యమవుతున్నా అడిగే దిక్కులేదు. పనిచేస్తున్నవారు ఎలాగూ అడగలేరు.. ఎందుకంటే అడిగితే ఉద్యోగాలు ఊడిపోతాయి. పోనీ సమాజంలోని జర్నలిస్టు సంఘాలైనా తమ గొంతుక విప్పుదామంటే ప్రభుత్వాలు , మీడియా సంస్థలు తొక్కిపెడతాయి. నినదించిన వాడి జీవితాన్ని బజారు పాలు చేస్తాయి. అందరికీ అన్ని సమకూర్చే మనం(జర్నలిస్టులం) కేవలం మన హక్కులు సాధించడంలో తరతరాలుగా విఫలమవుతూనే ఉన్నాం.. లేదా మనలో పౌరుషం.. మన జీవితాలు ఇంతేనా.. మన జీతాలు ఇంతేనా.. రోగులు, రొప్పులతో చావాల్సిందేనా.. మన వేతన సవరణ వట్టి మాటేనా.. కలం పట్టి కడిగేసే మనం కన్నీళ్లు మింగుతూ బతాకాల్సిందేనా.. ప్రభుత్వాన్నిప్రశ్నించి వేతన బోర్డును వేతనాలను పెంచుకునేదేదైనా ఉందా.?

ఈనెల 19న హైదరాబాద్ లో టీయూడబ్ల్యూజే ప్రథమ మహాసభ జరుగబోతోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న మొదటి మహాసభలివి.. ఈ మహాసభలకు అధికార, ప్రతిపక్షాల సభ్యులు హాజరవుతారు. అప్పుడైనా మన గళం వినిపిద్దాం. జర్నలిస్టుల కనీస అవసరాలైన అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్లస్థలాలు, వేతన సవరణకు పట్టుబడుతాం.. పోరాడితే పోయేదేంలేదు అని ఎన్నిసార్లు రాసాం.. దాన్ని ఇప్పుడు ఆచరణలో పెడదాం.. గళం విప్పండి.. సమస్యలు సాధించుకోండి.. టీయూడబ్ల్యూజే అండగా ఉంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *