Breaking News

‘మన తెలంగాణ’ దినపత్రికను ఆవిష్కరించిన కేసీఆర్

mana-telanganaF

హైదరాబాద్, ప్రతినిధి : రంగుల హంగులతో తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న మొదటి దినపత్రిక ‘మన తెలంగాణ’ను సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రగతికి పత్రికలు కరదీపికలు కావాలని , పాత్రికేయులు వైతాళికులుగా నిలవాలని సీఎం అన్నారు. సంచలనాల కోసం పాకులాడకుండా మంచి ప్రోత్సహిస్తూ ప్రభుత్వానికి మార్గనిర్ధేశం చేయాలని సూచించారు. ప్రజలే కేంద్ర బిందువుగా పత్రికలు పనిచేయాలని సూచించారు.

అసెంబ్లీలో సీఎం పేపర్లు విసిరితే మొదటి పేజీలో వేస్తారని.. అదే సీఎం తెలంగాణ గోస వినిపిస్తే 6వ పేజీలో వేసి నిర్లక్ష్యం చేస్తారని పత్రికల తీరును ఎండగట్టారు. తెలంగాణ వాదాన్ని ప్రసార మాధ్యమాలు ఏకపక్షంగా వ్యహరించి దెబ్బకొట్టాలని చూసినా.. తెలంగాణ సమాజం ఎదురొడ్డి ఉద్యమ బాట పట్టి స్వరాష్ట్రం సాధించిందని.. ఆ విషయన్ని గుర్తెరిగి పత్రికలు నేలవిడిచి సాము చేయవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో మన తెలంగాణ పత్రిక సంపాదకులు కే.శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కేశవరావు, మంత్రులు ఈటెల, తుమ్మల, పోచారం, జూపల్లి, లక్ష్మారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, తెదేపా నేత రమణ, టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *