మన తెలంగాణ ఎడిటర్ కే.శ్రీనివాస్ రెడ్డికి పితృవియోగం

01 k srinivas reddy

నల్గొండ : మన తెలంగాణ దినపత్రిక ఎడిటర్, ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్ కల్మెకొలను శ్రీనివాసరెడ్డికి పితృవియోగం కలిగింది. శ్రీనివాసరెడ్డి తండ్రి , ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కల్మెకొలను రాంరెడ్డి(96) తన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని పల్లెపహాడ్ లో గల తన సొంత ఇంటిలో మంగళవారం తుది శ్వాస విడిచారు. రాంరెడ్డికి శ్రీనివాసరెడ్డితో పాటు మరో ఇద్దరు కుమారులు ప్రభాకర్ రెడ్డి , కరుణాకర్ రెడ్డి  , ముగ్గురు కుమార్తెలు, భార్య అండమ్మ ఉన్నారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో రాంరెడ్డి చురుకుగా పాల్గొన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి 1948లో జైలు పాలయ్యాడు. మూడేళ్లు కఠిన కారాగార శిక్ష అనుభవించిన ధీశాలి రాంరెడ్డి గారు.. స్వాతంత్ర్య పోరాటం వైపు ఇక్కడి ప్రజలను చైతన్యపర్చడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆయన మృతిపట్ల రాజకీయ , జర్నలిస్టు సంఘాల నాయకులు సంతాపం ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *