
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ప్రపంచాన్ని ఆశర్యపరిచింది. ఎవరూ సాధించని ఘనతను సొంతం చేసుకుంది.. అంతరిక్షంలో ఎవరెస్ట్ లో ఉన్న అమెరికాకే షాక్ ఇచ్చి అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోయింది.. నిన్న ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ రాకెట్ పలు దేశాల ఉపగ్రహాలను నింగిలోకి పంపి విజయవంతంగా పరీక్ష పూర్తి చేసి భారతదేశ సత్తా చాటింది..
కాగా ఇటీవల అమెరికా ప్రయోగించిన ఉపగ్రహాలు రాకెట్ ఆకాశంలో పేలిపోయింది.. దాన్ని దృష్టిలోపెట్టుకొనే అమెరికా సైతం ఉపగ్రహాల పరీక్షను చేయాల్సింది గా భారత్ కు రెండు ఉపగ్రహాలను పంపింది. దీంతో అమెరికాతో పాటు కెనడా , ఫ్రాన్స్, ఇండోనేషియా, సహా 8 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలకు భారత్ సత్తాను చాటి చెప్పింది..