మన చదువులు మారాలి..

kcr-main

మన  చదువులు మారాలని సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణలో పేరుకుపోయిన విద్యావ్యవస్థను , ప్రైవేటు విద్యపై కేసీఆర్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వచ్చే జూన్ 1 నుంచే దీన్ని ప్రారంబించాలని ఆయన యోచిస్తున్నారు. ప్రాథమిక విద్యా జడ్పీనిధులతో నడుస్తోంది. మాధ్యమిక విద్యను ఇంటర్ బోర్డు.. ఉన్నత విద్యను ఉన్నత విద్యామండలి.. ఇక ఐటీఐలు కార్మిక శాఖ వారు, విద్యాసంస్థలు, సొసైటీలు, స్టడీసర్కిళ్లు వివిధ సంస్థలు.. ఇలా 60 ఏళ్లుగా అడ్డదిడ్డంగా ఉన్న విద్యాసంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని తెలంగాన సీఎం కేసీఆర్ ఆదేశించారు. విద్యాశాఖపై సమీక్షించిన కేసీఆర్ తెలంగాణలో ఉన్న అన్ని విద్యాసంస్థలను , కాలేజీలను  , స్టడీసర్కిల్లను, యూనివర్సిటీలను ఒక గొడుగు కిందకు తీసుకురావాలని ఆదేశించారు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యాశాఖ పరిధిలోనే తెలంగాణ విద్య ఉండాలని ఆదేశించారు. జూన్ లోగా సమగ్ర అధ్యయనం చేసి వాటన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆదేశించారు. అంతేకాదు విద్యార్థులకు ఉపాధి లభించేలా కార్యచరణ, విద్య ఉండాలని సూచించారు. దీంతో తెలంగాణ విద్య , విద్యార్థుల తలరాతలు మారనున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *