
సీఎం కేసీఆర్ తన స్వగ్రామం చింతమడక గ్రామస్థులతో భేటి అయ్యారు. హైదరాబాద్ లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారితో ఆప్యాయంగా గడిపారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరిని పేరు పేరున పలకరించిన కేసీఆర్ వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. చింతమడక గ్రామం తన స్వగ్రామమని.. ఆ ఊరుని బాగుచేయాల్సిన బాధ్యత తనది అని హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగ ా చింతమడక గ్రామస్థులు తమ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని కోరారు. కేసీఆర్ స్వగ్రామ ప్రజలే మండల కేంద్రం చేయాలని చెప్పడంతో ఇక కేసీఆర్ కూడా సరేనన్నాడు. మన సొంతూరు చింతమడకకు త్వరలోనే వస్తానని.. గ్రామస్థులందరితో కలిసి సమస్యలు పరిష్కరిస్తానని వారి హామీ ఇచ్చారు.