
హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు గొప్ప లక్ష్యాన్ని సాధించారు. పందుల అవయవాలను మనుషులకు అమర్చవచ్చని తమ పరిశోధనలతో నిరూపించారు. ఆ దిశగా అతిపెద్ద అడ్డంకులను అధిగమించారు. వరాహ జన్యువులోని రిట్రోవైరస్ లను క్రియారహితంగా మార్చడం ద్వారా వీటి అవయవాలు మనుషులకు సరిపడేలా చేయగలిగారు. గతంలో ఆరుచోట్ల మాత్రమే పంది జన్యువుల్లో మార్పులు జరగగా..శాస్త్రవేత్తలు అత్యంత శక్తివంతంగా జన్యు మార్పు ద్వారా ఏకంగా 62 కోట్ల పంది జన్యువులో మార్పు తెచ్చారు. ప్రమాదకర రిట్రో వైరస్ లను తొలగించారు. తద్వారా పంది అవయవాలను మనిషికి అమర్చే దిశగా పరిశోధనలు చేశారు.