మనమూ మారాలి తమ్ముడూ..!

మనమూ మారాలి.. నిర్లక్ష్యాన్ని విడనాడాలి.. జనం మారారు. అందుకే 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ను పక్కనపెట్టారు. నరేంద్ర మోడీకి పట్టం కట్టారు. మార్పు కోసం ఆయన స్వచ్ఛ భారత్ ను మొదలు పెట్టాడు. మూస ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్ తో నీతిమంత మైన పాలనకు శ్రీకారం చుట్టారు. ఆఖరకు రైల్వే బడ్జెట్ లో కూడా మార్పు వచ్చింది. ప్రతీసంవత్సరం కొత్త రైళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే జనంకు అవి లేకుండా అభివృద్ధి నినాదంతో కొత్త రూపు చూపించాడు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు..

మార్పు రావాలంటే ముందు దేశంలో అంతరించిపోవాల్సింది లంచగొండితనం. అవినీతి.. అది ఎక్కడున్నా పురుగులా తొలుస్తూనే ఉంటుంది.. అందుకే మనమందరం నిజాయితీ ఉన్నప్పుడే అవినీతి అంతానికి నాంది పలకగలం..

ఆ మార్పు దేశంలో రావాలనే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ వీడియో అందరినీ ఆలోచింప చేస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇందులో నటించారు. రూల్స్ పాటించడం.. అవినీతికి దూరంగా ఉండడం ఈ వీడియో ముఖ్య ఉద్దేశం మీరూ చూడండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *