మనది బ్లడ్ రిలేషన్..

ఇండియా, అమెరికాది బ్లడ్ రిలేషన్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో గూగుల్, మైక్రోసాఫ్ట్, సిస్కా, తదితర పేరుమోసిన సీఈవోలతో ఆదివారం మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ గూగుల్, మైక్రోసాఫ్ట్ నడిపించే సీఈవోలు సుందర్ పిచ్చై, సత్యనాదెళ్లలు భారతీయులని.. అందుకే మనది బ్లడ్ రిలేషన్ అని ఆయన అన్నారు.

డిజిటల్ ఎకనామీలో భారత్ అమెరికా భాగస్వామ్యానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ ప్రపంచంలో ఫేస్ బుక్ ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ మన ఇరుగు పొరుగులాంటివని ఆయన వ్యాఖ్యానించారు. డిజిటల్ యుగం మనకు ఊహించని విధంగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుందన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.