మనకా ‘ఆస్కారం’లేదు..

హైదరాబాద్, ప్రతినిధి : ప్రపంచ వ్యాప్తంగా నిర్మితమవుతున్న సినిమాలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం పురస్కారం ఆస్కార్.. ప్రతీ ఏడాది అద్భుతమైన సినిమాలకు ఈ అవార్డులు ఇస్తారు. కానీ ఆ ఆస్కార్ ఎప్పుడూ ఇండియన్ సినిమాకు అందనంత ఎత్తులోనే ఉంటుంది. కనీసం విదేశీ కేటిగిరీ ల్లో కూడా మన సినిమాకు అస్కార్ అవార్డులు అందడం లేదు.. ఎక్కడిదీ లోపం.. మన దగ్గర అంత ప్రతిభ గల దర్శకులు లేరా..? లేదా మన సినిమాలు, కథలు అంతా వీకా..? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఎప్పుడో 1960ల్లో భారతీయ చిత్రానికి విదేశీ చిత్రంగా వచ్చింది. మళ్లీ మొన్న ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకు అవార్డు వచ్చింది. దానికి ఉత్తమ సంగీతం అందించిన రెహమాన్ కి ఆస్కార్ అవార్డు వచ్చింది. విశేషమేంటంటే ఆ సినిమాను డైరెక్ట్ చేసింది మన భారతీయుడు కాదు.. బ్రిటన్ కు చెందిన వాడు. ఆయన మన బొంబాయిలోని మురికివాడలపై తీసిందే స్లమ్ డాగ్ సినిమా.. ఎంతైనా విదేశీ మైండ్ తో తీసింది కావడంతో ఆ సినిమాకు ఆస్కార్ వచ్చింది. మళ్లీ ఇక రాలేదు..

అసలు బాలీవుడ్ సినిమాలు ఆస్కార్ గడప తోక్కవెందుకు అని ప్రశ్నించుకుంటే.. ఆస్కార్ కు సినిమా ఎంపికవ్వాలంటే వారు మొదట చూసేది నాచురాలిటీ.. అంటే సహజత్వం.. నిజంగా జీవితాల్లో జరిగేదే సినిమాల్లో ఉండాలి. కానీ మన హిందీ సినిమాల్లో అవేవి కనిపించవు. హీరోలు కొడితే గాల్లో ఎగిరే విలన్లు ఇప్పటికీ ఉన్నారు. హీరో ఇండ్రక్షన్ గ్రాండ్ గా చూపిస్తూ హైప్ సృష్టిస్తుంటారు. ముఖ్యంగా ప్రజలకు ఎంతో ఇష్టంగా చూసే పాటలుంటాయి.. రంగురంగుల దుస్తులు, హంగామా ఉంటుంది.

కానీ ఆస్కార్ నామినేషన్ కు ఇవేమీ అవసరం లేదు. పాటలనేది నిత్యజీవితంలో ఉండవు. మనం సంతోషం వేస్తే పాటలు ఒకేసారి విదేశాలకు వెళ్లి పాడుకోలేం కదా..? ఇదే అసహజత్వ సినిమాలే మనల్ని ఆస్కార్ కు దూరం చేశాయి.. నేచురాలిటీ లేకుండా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంటారు.. భారత దేశంలోని దర్శకులు.. అందుకే మన సినిమా అస్కార్ పండుగకు అంత దూరంగా ఉంటాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *