Breaking News

మధ్యప్రదేశ్ లో కుంభకోణం.. వరుస హత్యలు

vyapam_collage

మధ్యప్రదేశ్ సాంకేతిక విద్యా మండలిలో నియామకాలు, ప్రవేశాల్లో భారీ అక్రమాలు జరిగాయి. ఈ కుంభకోణంలో బాధ్యులు, దాన్ని వెలికి తీయడానికి వెళ్లిన విలేకరి సైతం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనుమానాలు దారితీస్తోంది. ఇది భారీ కుంభకోణమని.. దీని వెనుక సీఎం చౌహాన్ ఇతర పెద్దలు ఉండడంతోనే సాక్ష్యాలు లేకుండా వారందరినీ హతమారుస్తున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు విమర్శిస్తున్నారు.

కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న వైద్యుడు అరుణ్ శర్మ(64) ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్లో మృతి చెంది విగతజీవిగా పడి ఉన్నారు.  శర్మకు ముందు దర్యాప్తు చేసిన మరో వైద్యుడూ ఇంట్లోనే ‘కాలిపోయి’ ప్రాణాలు వదలడం గమనార్హం.

కాగా ఈ కుంభకోణంపై కథనం ఇచ్చేందుకు  వెళ్లిన ఒక టీవీ చానెల్ కు చెందిన పరిశోధనాత్మక విలేకరి  సైతం 48 గంటల్లోనే ప్రాణాలు కోల్పోవడం.. ఈ కుంభకోణంలో పెద్దల పాత్ర ఉన్నట్టు స్పష్టం చేస్తోంది.

కాగా ఢిల్లీలో చనిపోయిన వైద్యుడు, జర్నలిస్టు అంత్యక్రియలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనిష్ సిసోడియా తదితర నేతలు హాజరై అంతిమయాత్రలో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *