
హైదరాబాద్ : వర్థమాన గాయని.. తెలంగాణ ఉద్యమంతో వెలుగులోకి ‘ఆడపిల్లనమ్మా’ అనే పాటతో ఫేమస్ అయిన మధుప్రియ ప్రేమ పెళ్లికి తయారైంది.. సరిగ్గా 18 ఏళ్లు నెల క్రితమే నిండిన మధుప్రియ తను మేజర్ కావడంతో రెండేళ్లుగా ప్రేమిస్తున్న ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన మంగి శ్రీకాంత్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది.. వీరిద్దరి వివాహం 30న ఇవాళ కాగజ్ నగర్ లోని వాసవీ గార్డెన్ లో జరుగుతుందని శుభలేఖలు కూడా కొట్టించారు.
లేచిపోయి వచ్చిన మధుప్రియ
మధుప్రియ వయసు 18 ఏళ్లే ఇటీవలే మైనార్టీ తీరింది. పెళ్లి చేసుకునే వయసు కాదు.. హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న శ్రీకాంత్ తో రెండేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తుంది. ఈ విషయం మదుప్రియ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అందుకే శ్రీకాంత్ ఇంటికి ఇంట్లో నుంచి పారిపోయి ప్రియుడి ఇంటికి వచ్చింది.. ఇవాళ ఉదయం 11 గంటలకు పెళ్లి చేసుకోనుంది. కాగా నిన్న రాత్రి మధుప్రియ తల్లిదండ్రులు ప్రియుడు ఇంటిపై దాడి చేశారు. మధుప్రియను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. మధుప్రియ, శ్రీకాంత్ లు స్థానిక డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో రెండు కుటుంబాలకు, ప్రేమికులకు రాత్రి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
మేజర్లు కావడంతో వారి పెళ్లికి తమకు అభ్యంతరం లేదని పోలీసులు తెలిపారు. దీనిపై మధుప్రియ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి కెరియర్ వదులుకొని ఇలా నాశనం అవుతున్న కూతురిపై మండిపడుతున్నారు.