‘మద గజ రాజా’తెలుగు హక్కులు ‘శ్రీ ఓబులేశ్వర్ ప్రొడక్షన్స్’సొంతం!!

ఇటీవల జరిగిన ‘తమిళ నడిగర్ సంఘం’ఎన్నికల్లో హేమాహేమీలను ఢీకొని ఘన విజయం సాధించి.. ‘వార్లల్లో వ్యక్తి’గా నిలిచిన సంచలన కధానాయకుడు విశాల్ తాజా తమిళ చిత్రం ‘మద గజ రాజా’ తెలుగు హక్కులు శ్రీ ఓబులేశ్వర్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకొంది. విశాల్ సరసన అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న ఈ చిత్రానికి సుందర్ సి. దర్శకుడు 80 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను జెమిని ఫిలిం సర్క్యూట్ సమర్పణలో ‘సన్నితి క్రియేషన్స్’తో కలిసి శ్రీ ఓబులేశ్వర్ ప్రొడక్షన్స్ పతాకంపై యువ నిర్మాతలు తమటం కుమార్ రెడ్డి- ప్రసాద్ సన్నితి సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

MGR

. ఘన విజయం సాధించిన ‘జిల్లా’అనంతరం శ్రీ ఓబులేశ్వర్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న ‘మద గజ రాజా’ తెలుగు అనువాదానికి టైటిల్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది. సోనూసూద్, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ సదా ఓ స్పెషల్ సాంగ్ చేయగా.. ప్రముఖ కధానాయకుడు ఆర్య అతిధి పాత్ర పోషించడం విశేషం. నిర్మాతలు తమటం కుమార్ రెడ్డి- ప్రసాద్ సన్నితి మాట్లాడుతూ.. ‘జిల్లా’అనంతరం ‘మద గజ రాజా’ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. సూపర్ స్టార్ సూర్య నటిస్తున్న ‘మేము’చిత్రం నిర్మాణంలో సైతం మేము పాలుపంచుకొంటున్నాం. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో రూపొందిన ‘మద గజ రాజా’లోని ప్రతి సన్నివేశం కనుల విందుగా ఉంటుంది.

MGR12

విశాల్, అంజలి, ప్రకాష్ రాజ్, సోనుసూద్, సుబ్బరాజు, సదా, ఆర్య ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం కావడంతో.. స్ట్రయిట్ సినిమా చూస్తున్నట్లుగానే ఉంటుంది. డబ్బింగ్ పరంగానూ అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకొన్నామన్నారు. తెలుగులో టైటిల్ ను త్వరలోనే నిర్ణయించనున్నామన్నారు. ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర్రాలలో విశాల్ కు గల ఫ్యొన్ ఫాలోయింగ్ ను మరింతగానే పెంచే ప్రతిష్టాత్మక చిత్రమిదని వివరించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రిచర్డ్, సంగీతం: విజయ్ ఆంటోని, సమర్పణ: జెమిని ఫిలిం సర్క్యూట్, బ్యానర్స్: శ్రీ ఓబులేశ్వర్ ప్రొడక్షన్స్- సన్నితి క్రియేషన్స్, నిర్మాతలు: తమటం కుమార్ రెడ్డి- ప్రసాద్ సన్నితి, కధ- స్క్ర్రీన్ ప్లే- దర్శకత్వం: సుందర్. సి!!

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *