
కరీంనగర్ జిల్లాలోని మద్యం షాపులకు నిర్వహించిన టెండర్ల విడుదల కార్యక్రమం కరీంనగర్ కలెక్టరేట్ లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్యం షాపుల టెండర్లు ను కలెక్టర్ విడుదల చేశారు. లాటరీ ద్వారా గెలిచిన వారికి లైసెన్స్ పత్రాలు అందజేశారు.. విడుదల కార్యక్రమం లో మాట్లాడిన జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఖచ్చితంగా ఎమ్మార్పీ ధరకే అమ్మాలని లైసెన్స్ దారులను సూచించారు.