
ఒకప్పుడు ఆయన గొప్పదర్శకుడు.. ఇండియాలోనే గొప్ప పేరు సంపాదించారు. కానీ ఇప్పుడు కొన్నేళ్లుగా విజయం కోసం చకోరపక్షిలా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఒక్క విజయం కోసం ప్రయత్నిస్తూ ప్లాప్ లు చవిచూస్తూనే ఉన్నారు. ఆయనే గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం.
మరోసారి తనకు అచ్చొచ్చిన ప్రేమకథను రసరమ్యంగా మలిచి ప్రే క్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు. ఈ సారి ఎలాగైన విజయం సాధించాలనే పట్టుదలతో రూపొందిస్తున్నారు. ‘ఓకే కన్మని’ సినిమాని.. మద్రాస్ టాకీస్ సొంత పతాకంపై ‘ఓకే కన్మని’ మణిరత్మమే నిర్మాతగా రూపొందిస్తున్నారు. సినిమాలో హీరోహీరోయిన్లుగా సల్మాన్, నిత్యమీనన్ నటిస్తున్నారు. మంచి ప్రేమ కథ ఈ స్టోరీ.. సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాకు ఏఆర్ రహమూన్ మ్యూజిక్ అందించారు. సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది.