
ఇంపాల్ , ప్రతినిధి : మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంపాల్ లో ఆదివారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన నలుగురిలో ఇద్దరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఏ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు తామే కారణమని ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత జాతీయ నిఘా సంస్థ సంఘటనాస్థలానికి చేరుకుని… సంఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తుంది.