
అవును మట్టి మనిషే.. మట్టి వాసన చూసినవాడు కాబట్టే ఆ మట్టి వాల్యూను ఇట్టే పసిగట్టాడు. అందుకే వట్టిపోయిన చెరువులకు పూర్వవైభవం తీసుకురావడానికి తలంచాడు. చెరువు మట్టిని తీసి వాటిని నీటితో కళకళాడించేందుకు పూనుకున్నాడు. కాకతీయుల కాలం నాటి చెరువలకు నీటి కళ తెచ్చేందుకు పూనుకున్నాడు. మిషన్ కాకతీయ పేర చెరువుల మహర్ధశను మళ్లీ చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు.
సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ శ్రీకారం చుట్టాడు. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ గ్రామంలోని పాత చెరువుకు నిన్న స్వయంగా మట్టి తవ్వి ఎత్తిపోసి ప్రారంభించారు. అసెంబ్లీ అయిపోగానే ప్రతి మంత్రి, ఎంపీ,ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నాయకులు చెరువుల్లో టెంట్లు వేసుకొని వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు.
సీఎం కేసీఆర్ పట్టుదల వల్ల నేడు చెరువులు బాగుపడుతున్నాయి. వచ్చే వానకాలంలో చెరువుల్లో నీటి నిల్వ పెరుగనుంది. తద్వారా రైతుల పంటలు బాగా పండుతాయి. నీటి కొరత తీరుతుంది. తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ఇదే కాదా కావాల్సింది. జై హో మిషన్ కాకతీయ..