
ప్రకృతి వినాషనానికి దారితీసే ప్లాస్టర్ ఆప్ పారీస్ వినాయకుల కన్నా.. మట్టితో చేసే గణపతులే మేలు అని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రేపు గణేష్ పండుగ పురస్కరించుకొని ఎన్నో రసాయనాలు, రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన గణపతులను వాడవద్దని ప్రచారం చేస్తున్నారు.
ప్లాస్టర్ ఆప్ ప్యారీస్ గణనాథుల వల్ల పర్యావరణం దెబ్బతింటుంది.. చెరువుల్లో నిమజ్జనం చేస్తే చెరువులోని జీవరాశులు చనిపోతాయి.. ఆ నీల్లు తాగిన పశువులు, మనుషులకు కూడా ప్రాణపాయం సంభవిస్తుంది.. ప్లాస్టర్ ఆప్ పారీస్ చెరువు అడుగుబాగాన కరిగిపోకుండా మేట వేసి నీళ్లను ఇంకనీయదు.. దీనివల్ల భూగర్భ జలాలు పెరగవు.. రసాయనిక రంగుల వల్ల ఓజోన్ పొర సైతం దెబ్బతింటుంది. అందుకే సహజంగా మట్టితో చేసిన గణేష్ ప్రతిమలనే వాడి ప్రకృతి సమతుల్యతను కాపాడండి..