మట్టిగణపతులనే పూజిద్దాం….

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజించాలని రాష్ట్ర్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. సచివాలయంలో చిన్నారులు, అధికారులు, ఉద్యోగులకు టీఎస్ పీసీబీ ఆధ్వర్యంలో మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా చేయూతను అందించాలని కోరారు. కాలుష్య భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని ఆయన అన్నారు. కాలుష్య కారకాలను దూరం ఉంచాలని సూచించారు. కాలుష్యం పెరిగిపోవటానికి మానవ తప్పిదాలు కూడా ఒక కారణమని ఆయన అన్నారు. రసాయనాలతో కూడిన గణపతుల వల్ల కాలుష్యం పెద్ద ఎత్తున పెరిగిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గణపతుల నిమజ్జనం అనంతరం కొన్ని రోజుల వరకు వాటిని తొలగించలేని పరిస్ధితి ఉంటుందని ఆయన అన్నారు. రసాయనాల వల్ల చెరువులు, కుంటు కలుషితం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై నిరంతర నిఘా కొనసాగుతోందని సత్యనారాయణ రెడ్డి అన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా కాలుష్య వ్యర్ధాలను తరలించే వాహనాలను మానిటరింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ జాయింట్ సెక్రటరీ క్రుష్ణ వేణి, పీసీబీ సీనియర్ పర్యావరణ ఇంజనీర్లు రవీందర్, రవీందర్ రెడ్డి, తెలంగాణ సచివాలయ సంఘం అధ్యక్షులు ఎం.నరేందర్ రావు, అటవీ శాఖా మంత్రి పీఎస్ డాక్టర్ బీ విష్ణువర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు.

సత్యనారాయణ రెడ్డి

సత్యనారాయణ రెడ్డి

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *