
కరీంనగర్ : బతుకమ్మ అంటేనా మహిళల పండుగ.. మహిళలు, పువ్వులు లేనిదే బతుకమ్మ పండుగే లేదు.. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ పండుగను ఆడడానికి మగాళ్లు ఆడుతున్నారు. ఆడగలమని నిరూపించారు.
కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్ లో పురుషులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలను నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని పలు ఔత్సాహిక పురుషులు బతుకమ్మ పోటీల్లో పాల్గొన్నారు.
స్వయంగా పూలతో బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మలను ఒక్కచోట చేర్చి ఆడవాళ్లవలే బతుకమ్మ ఆడారు. చుట్టూ ఉయ్యాలా అంటూ చప్పట్లతో ఆడిపాడారు.
అనంతరం జడ్జీలు ఈ బతుకమ్మల్లో బాగా పేర్చిన పురుషుల బతుకమ్మలకు బహుమతులు అందజేశారు.