
మగధీర.. రాంచరణ్ జీవితంలో మరిచిపోలేని సినిమా.. ఆ సినిమాలో డైలాగులకు మంచి పేరు వచ్చింది రాంచరణ్ కు.. ‘ఒక్కక్కరిని కాదు షేర్ ఖాన్.. వందమందిని ఒకే సారి రమ్మను’ ఈ డైలాగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే..
అయితే ఇదే డైలాగును గుక్కతిప్పుకోకుండా చెప్పాడు ఓ బాలుడు. ఆ వీడియోను యూట్యూబ్, ఫేస్ బుక్ లో పెట్టారు. అటొచ్చి.. ఇటొచ్చి ఆ వీడియోను ఇటీవల రాంచరణ్ చూశాడు. ఆ బాలుడి డైలాగులకు చాలా ఇంప్రస్ అయ్యాడు. వెంటనే ఆ బాలుడిని కలవాలనుందని.. తన దగ్గరకు తీసుకురండని ఫేస్ బుక్ లో స్నేహితులకు మెసేజ్ పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఇదే..