
ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం కామోల్ లో మధ్యపాన నిషేధం అమలు చేస్తున్నారు. దీంతో ఆ ఊరిలో మద్యం తాగడం, అమ్మడం నిషేధం . ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తారు.
కాగా ఫుల్లుగా రోజు తాగిన గొంతులకు ఒక్కసారిగా మద్యం బంద్ కావడంతో మందుబాబులు అస్వస్థతకు గురవుతున్నారు. మొన్న 5 గురు ఆస్పత్రి పాలు కాగా.. నిన్న 20 మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు. పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈ దెబ్బకు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. రోగుల సంఖ్య పెరగడం తో భైంసాలో కూడా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అయినా ఇంకా బాధితులు పెరుగుతుండడంతో ఒకే మంచంపై ఇద్దరిని పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు.
హతవిధీ మందు తాగితే ఆస్పత్రి పాలవడం చూశాం కానీ బంద్ చేస్తే ఇలానా జరుగుతుందా అనిగ్రామస్థులు , మహిళలు ఆందోళన చెందుతున్నారు.
మద్యం ఒకేసారి బంద్ చేస్తే నరాలు సంకోచిస్తాయి.. నీటిశాతం తగ్గి కుచించుకుపోతారని వైద్యులు తెలిపారు. అందుకే కొద్దికొద్దిగా మానేయాలని.. ఒకసారి మానేస్తే దుష్ఫరిణామాలు తలెత్తుతాయని తెలిపారు.