మందుబాబులపై పోకస్

డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ పోకస్ పెట్టారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారి తాటా తీస్తున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపబడిన మందుబాబులను జైలుకు పంపుతున్న పోలీసులు.. రిపీటేడ్ గా పట్టుబడితే.. లైసెన్స్ లను రద్దు చేస్తున్నారు. అంతేకాదు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో బైక్ లు నడుపుతున్న వారితోపాటు కార్లు, బస్సు డ్రైవర్లు కూడా పీకల్లోతు తాగి డ్రైవింగ్ చేస్తుండడంతో స్ట్ర్రిట్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ అమలు చేస్తున్నారు. మద్యపాన ప్రియులు ఇక నుంచి ట్రాఫిక్ పోలీసుల రూల్స్ తప్పకుండా పాటించాలి. రూల్స్ బ్రేక్ చేస్తూ డ్రైవింగ్ చేసే మందుబాబులపై నగర్ ట్రాఫిక్ పోలీసులు కొరడాజులిపించనున్నారు. మొదట్లో తాగి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడితే జరిమానాతో సరిపెట్టే ట్రాఫిక్ పోలీసులు.. ఆ తర్వాత జరిమానా విధానంతోపాటు అరెస్ట్ చేసి ఏకంగా జైలుకే పంపుతున్నారు. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185 ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు నగర ట్రాఫిక్ పోలీసులు. నగరంలో నైట్ పార్టీల సంస్క్రుతి, రేవ్ పార్టీలు, విందులు, వినోదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే మధ్యంపాన సాధారణ అంశమైనా,, మోతాదుకు మించి తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మత్తులో విపరీతమైన వేగంతో నడపడం, ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనలు తరచూ చేటుచేసుకుంటున్నాయి. గతంలో మధ్యం మత్తులో వాహనాలు నడిపేవారి గుర్తించి శాంతిభద్రతల పోలీసులు అప్పుడుప్పడు ఆపి కేసులు నమోదు చేసేవారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్డు సహా నగరంలోని ప్రధాన ప్లైఓవర్లపై రాత్రుళ్లు రోడ్డు ప్రమాదాలు అధికంగా నమోదు అవుతున్నాయని పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఆయా ప్రాంతాల్లో కార్లు డివైడర్లను ఢీకోనడంతో ,ద్విచక్రవాహనాలు ప్లైఓవర్ల పైనుంచి కింద పడి చనిపోవడం వంటివి నియంత్రించకపోతే భవిషత్తులో చాలా ప్రమాదాలు చోటుచేసుకుంటాయని భావించిన హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం..డ్రంకెన్ డ్రైవ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని 2011 నవంబర్ 4న ప్రారంభించింది. నగరంలో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో వారంలో శుక్ర, శని వారంలో పదహారు నుంచి పదిహేడు ప్రత్యేక ట్రాఫిక్ పోలీసుల టీమ్ లు రంగంలో దిగుతారు. రాత్రి పదిగంటల నుంచి అర్ధరాత్రి ఒక్కటి వరకు వాహనాలను తనిఖీ చేసి మోతాదుకుమించిన మధ్యం తాగినవారిని పట్టుకుని జరిమానా విధించడం మొదలు పెట్టారు. ఇవి సత్పలితావివ్వడంతో అధికారులు మరిన్ని బ్రీత్ అనలైజర్లను సమకూర్చుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. విచ్చల విడిగా మధ్యం తాగి డ్రైవింగ్ చేసే మందుబాబుల వలన రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని నగర వాసులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై నడిచివేళ్లే వారినే కాకుండా ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా మందుబాబులు తాగిన మత్తులో స్రుహా కోల్పోయి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. మందుబాబుల డ్రైవింగ్ వలన ఏతప్పు చేయని అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అయితే మధ్యంతాగి వాహనాలను నడిపేవారిలో కనీసం 70 శాతం మంది రోడ్డు ప్రమాదాలు జరుగుతునట్లు సమాచారం. 2011 నవంబర్ 4 నుంచి డ్రైంకేన్ డ్రైవింగ్ పేరుతో ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్ లలో ప్రతి వారం కనీసం 200 నుంచి 250 మంది వరకు మధ్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. దీనికితోడు పట్టుబడిన వారి కార్లు, ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
అయితే 2014 లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొత్తం 14 వేల 246 కేసులు నమోదు కాగా.. అందులో 2 వేల 490 మందికి జైలు శిక్ష పడింది. అదే ఏడాదిలో డ్రంక్ అండ్ డ్రైప్ పేరుపై 2 కోట్ల 89 లక్షలు జరిమానా రూపంలో ఆదాయం వచ్చింది. 2015 లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొత్తం 16 వేల 633 కేసులు నమోదు కాగా…. అందులో 2 వేల 940 మందికి జైలు శిక్ష పడింది. అదే ఏడాదిలో డ్రంక్ అండ్ డ్రైప్ పేరుపై 2 కోట్ల 77 లక్షలు జరిమానా రూపంలో ఆదాయం వచ్చింది. 2016 లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొత్తం 16 వేల 602 కేసులు నమోదు కాగా.. అందులో 7 వేల 17 మందికి జైలు శిక్ష పడింది. అదే ఏడాదిలో డ్రంక్ అండ్ డ్రైప్ పేరుపై 2 కోట్ల 92 లక్షలు జరిమానా రూపంలో ఆదాయం వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ వలన రోడ్డు ప్రమాదాలు కొంతవరకు తగ్గు మొఖం పట్టిన.. కేసుల నమోదు సంఖ్య మాత్రం ఏటా పెరిగిపోతోంది. దీంతో నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ను మరింత కఠినంగా అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగే ప్రాంతాల సంఖ్య పెంచనున్నారు. త్వరలో మందుబాబులు సిటీలో ఏ సందునుంచి వెల్దామనుకున్న ట్రాఫిక్ పోలీసులకు చిక్కాల్సిందేనని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *