మంథని సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి హరీశ్ రావు

మంథని సాగునీటి సమస్యలకు శాశ్వత  పరిష్కారం.

మరో రెండు కొత్త లిఫ్టులు.

-మంత్రి హరీశ్ రావు.

మంథని అసెంబ్లీ నియోజక వర్గంలో సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. మంథని శాసన సభ్యుడు పుట్ట మధు ఆధ్వర్యంలో గురువారం అసెంబ్లీలో పలువురు రైతులు కలిసి తమ సమస్యలను వివరించారు. మంథని, కమాన్ పూర్,రామగిరి, మంథని ముత్తారం మండలాల్లో సాగునీటి సమస్యలను పరిష్కరించాలని రైతులు మంత్రికి విజ్ఞప్తి చేశారు.ఇందుకు హరీశ్ రావు సానుకూలంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు లతో పాటు చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి ఈ నియోజకవర్గం ఆయకట్టు ను పరిరక్షిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డి 83 కింద ఉన్న L 6,L 8 కాలువలకు తగిననీరు సరఫరా జరగడం లేదని,సింగరేణి ఓపెన్ కాస్ట్ వల్ల L 6  కెనాల్ పూర్తిగా దెబ్బతిన్నట్టు మంత్రి హరీశ్ రావు దృష్టికి రైతులు తీసుకు వచ్చారు.పోతారం గ్రామం దగ్గర లిఫ్టు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు హరీశ్ రావు చెప్పారు. సుందిళ్ళ, ముస్తాల సమీపంలో మరో లిఫ్టు ఏర్పాటు చేస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా మహాముత్తారం మండలం లోని అన్ని గ్రామాలకు సాగునీటి సరఫరా జరుగు తుందన్నారు.కాళేశ్వరం సమీపంలో తలపెట్టిన చిన్నకాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్ పధకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయనున్నట్టు మంత్రి తెలియజేశారు.మంథని నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు ఈ లిఫ్ట్ సాగునీరు అందించనున్నది. వచ్చే వానాకాలం చిన్న కాళేశ్వరం పనులు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

harish rao 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.