
తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రులందరూ డమ్మీ అయిపోయారు. కేసీఆర్ ఏక స్వామ్య పాలన కొనసాగుతోందట.. కనీసం మంత్రులు తమ నియోజకవర్గాల్లో పనులు కూడా చేయించుకోవడానికి వీల్లేకుండా కేసీఆర్ వ్యవహరిస్తున్నారట.. కేసీఆర్ ను అడిగే దమ్ము ధైర్యం మంత్రులకు లేక ఇక కేటీఆర్ నే పనుల కోసం అడుగుతున్నారట.. ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గంలో కేటీఆర్ చెబితేనే పనులు ముందుకు సాగుతున్నాయట..
కేసీఆర్ ముందు మంత్రులు డమ్మీలైపోవడంతో ఆయా శాఖల అధికారులు కూడా వీరిని పట్టించుకోవడం లేదట.. అందుకే ఈ మధ్య కరీంనగర్ లో ఓ కార్యక్రమంలో కలిసిన ముగ్గురు మంత్రులు తమకు ప్రాధాన్యం లేదని మంత్రులమేనా అని వాపోయారట.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరూ కేసీఆర్ ను కలిసి దర్జాగా పనులు చేయించుకుంటుంటే మంత్రులు మాత్రం పనులు చేయించుకోలేకపోతున్నారట.. కేసీఆర్ ను అడగడానికి భయపడుతున్నారట.. దీంతో ఇప్పుడు కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంలో కీరోల్ అయ్యారు..