మంత్రి ల‌క్ష్మారెడ్డితో నిజామాబాద్ ఎంపీ క‌విత భేటీ

నిజామాబాద్ పార్ల‌మెంట్‌లోని  వైద్య స‌దుపాయాల పెంపు, మెరుగుకై స‌మీక్ష‌

హైద‌రాబాద్: నిజామాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో వైద్య స‌దుపాయాల పెంపు, మెరుగుద‌ల కోసం పార్ల‌మెంట్ స‌భ్యురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డితో భేటీ అయ్యారు. మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలోని మంత్రి చాంబ‌ర్‌లో నిజామాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని వైద్య ఆరోగ్య‌, వైద్య విద్య‌, కుటుం సంక్షేమంపై సుదీర్ఘంగా స‌మీక్ష చేశారు. మెరుగైన స‌దుపాయాల కోసం ఈ బ‌డ్జెట్ లో అవ‌స‌ర‌మైన‌ నిధులు కేటాయింపున‌కు ప్ర‌తిపాద‌న‌ల‌ను మంత్రికి అంద‌చేశారు. మంత్రి ల‌క్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ జిల్లా ప్ర‌ధాన వైద్య‌శాల‌ను 500 ప‌డ‌క‌ల నుంచి 700 ప‌డ‌క‌ల‌కు పెంచాల‌ని చెప్పారు. జ‌గిత్యాల‌లో మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు చేయాల‌ని, కోరుట్ల‌లో 100 ప‌డ‌క‌ల వైద్య‌శాల ఏర్పాటు, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌లో వెల్ నెస్ సెంట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు.  జ‌గిత్యాల‌లో మాతా శిశు ఆరోగ్య కేంద్రం భ‌వ‌నాన్ని త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్నారు. జ‌గిత్యాల‌కు మ‌రో రెండు అంబులెన్స్‌ల ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

జిల్లా కేంద్రం నిజామాబాద్‌కి అంబులెన్స్ కావాలని కోరారు. నందిపేటలో 30 ప‌డ‌క‌ల‌ క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ ఏర్పాటు చేయాల‌ని కోరారు.  నిజామాబాద్‌, బోధ‌న్‌, జ‌గిత్యాల‌లోని వైద్య‌శాల‌ల్లో సిబ్బంది కొర‌త తీర్చాల‌ని చెప్పారు. నిజామాబాద్‌, బోధ‌న్‌, జ‌గిత్యాల‌లో సిద్ధంగా ఉన్న‌ డ‌యాల‌సిస్ కేంద్రాలను ప్రారంభించాల‌ని కోరారు. బోధ‌న్‌లో న‌ర్సింగ్ కాలేజీ సొంత భ‌వ‌నం, స్టాఫ్ లేనందున ప్ర‌స్తుతం క్లాసులు నిజామాబాద్‌లో నిర్వ‌హిస్తున్నామ‌ని క‌విత చెప్పారు. వెంట‌నే న‌ర్సింగ్ కాలేజీకి భ‌వ‌నాన్ని నిర్మించి, స్టాఫ్‌ని నియ‌మించాల‌ని కోరారు. నిజామాబాద్ వైద్య‌శాల‌లో బ‌యో మెడిక‌ల్ విస‌ర్జితాల‌ను బ‌ర్న్ చేసే ఇన్సినేట‌ర్ యంత్రం స‌మ‌కూర్చాలి లేబ‌ర్ రూమ్స్‌లో విద్యుత్ స‌మ‌స్య‌ల తలెత్తిన‌ప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండ‌డానికి ఇన్వ‌ర్ట‌ర్‌ని ఏర్పాటు చేయాల‌ని కోరారు. నిజామాబాద్‌లో ఎంఆర్ఐ ఉంద‌ని, టెక్నీషియ‌న్స్ లేర‌ని చెప్పారు. అయితే టెక్నీషియ‌న్ల భ‌ర్తీ టిఎస్ పిఎస్‌సీ ద్వారా చేస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే పూర్త‌వుతుంద‌ని మంత్రి వివ‌రించారు.

mp kavitha 1

నిజామాబాద్ జిల్లాకు ఇంకా పాత కోటా కింద మాత్ర‌మే మందులు స‌ర‌ఫ‌రా అవుతున్నాయ‌ని, కోటా పెంచాల‌ని ఎంపి క‌విత కోరారు. కాగా, జ‌గిత్యాల‌లో మాతాశిశు వైద్య‌శాల మంజూరయింద‌ని, అయితే స్థ‌ల సేక‌ర‌ణ కోసం క‌లెక్ట‌ర్‌ని ఆదేశించామ‌ని మంత్రి తెలిపారు. కొత్త‌గా వైద్య‌శాఖ సానిటేష‌న్‌, సెక్యూరిటీ కి తోడుగా, పేషంట్ కేర్‌ని జోడించి కొత్త విధానాన్ని తెచ్చింద‌ని, దీంతో బోధ‌న‌, బోధ‌నేతర వైద్య‌శాల‌ల కొంత సిబ్బంది కొర‌త తీరుతుంద‌ని మంత్రి ఎంపి క‌విత‌కు
వివ‌రించారు.

ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో బోధ‌న్‌, జ‌గిత్యాల డ‌యాల‌సిస్ కేంద్రాల ప్రారంభం

ఫిబ్ర‌వ‌రిలో రెండో వారంలో బోధ‌న్‌, జ‌గిత్యాల డ‌యాల‌సిస్ కేంద్రాల‌ను ప్రారంభించాల‌ని ఈ స‌మీక్ష స‌మావేశంలో నిర్ణ‌యించారు. ఈ లోగా ఆయా డ‌యాలిసిస్ కేంద్రాల‌ను సంసిద్ధం చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.  ఈ స‌మావేశంలో వైద్య‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శాంతి కుమారి, కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌, డిఎంఇ డాక్ట‌ర్ ర‌మేశ్‌రెడ్డి, తెలంగాణ ఔష‌ధ సేవ‌లు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న సంస్థ ఎండి వేణుగోపాల‌రావు, చీఫ్ ఇంజ‌నీర్ ల‌క్ష్మ‌ణ్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

mp kavitha 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *