
మంత్రి లక్ష్మారెడ్డిని మున్నాభాయ్ ఎంబీబీఎస్ అంటూ ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో నిర్వహించిన సభలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశ్నించడం దుమారం రేపింది.మహబూబ్ నగర్ జిల్లాలోని మద్దూర్ మండలంలోని సభలో పీహెచ్ సెంటర్ ప్రారంభోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి లక్ష్మారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ హాజరయ్యారు. కాగా మంత్రి మాట్లాడుతూ ఇంకా తెలంగాణలో ఆంధ్రావారి తొత్తులకు వారికి అమ్ముడుపోయిన వారున్నారని తెలిపారు.
దీనిపై రేవంత్ ఘాటుగానే స్పందించాడు.. నువ్వు కూడా గతంలో చంద్రబాబు కింద పనిచేశావని.. నువ్వు ఆంధ్రా తొత్తువే కదా అని నిలదీశాడు.. తర్వాత నువ్వో దొంగ ఎంబీబీఎస్ అని మున్నాభాయ్ ఎంబీబీఎస్ అంటూ నిలదీశాడు..
కాగా మంత్రి తన ఎంబీబీఎస్ డిగ్రీపై క్లారిటీ ఇచ్చాడు.. నేను గుల్బార్గాలో హోమియోపతి లో ఎంబీబీఎస్ చేశానని.. 1985లో పూర్త చేశానని దమ్ముంటే తనది దొంగ డిగ్రీ అని నిరూపించు .. రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు.