
మంత్రి లక్ష్మారెడ్డి తెలంగాణలోని ఆస్పత్రుల స్థితిగతులను మార్చడానికి నడుం బిగించారు. హైదరాబాద్ శివారు బీబీనగర్ లో నిమ్స్ ను ప్రారంభించేందుకు పరికరాలు, ఆధునిక వసతులు కల్పించిన ఆయన త్వరలోనే ముఖ్యమంత్రితో నిమ్స్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక దాంతో పాటు ఉస్మానియా, గాంధీ, ఆదిలాబాద్ రిమ్స్ సహా అన్ని ఆస్పత్రులకు అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు టెండర్లు నిర్వహించారు.
ప్రైవేటు దోపిడీ, ఆరోగ్య శ్రీ వేల కోట్ల దుర్వినియోగంతో మేల్కొన్న తెలంగాణ సర్కారు ప్రస్తుతం సర్కారు ఆసుపత్రులకు ఆపరేషన్ మొదలైనట్టే కనపడుతోంది.. తక్షణం 2400 వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు కూడా మంత్రి నిర్ణయం తీసుకున్నారు.. వీటిని వెంటనే టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు నిర్ణయించింది. ఆస్పత్రుల్లో సేవల కోసం సూపరింటెండెంట్లు, వైద్యాధికారులకు నిధులు, స్థానిక నియామకాల్లో అధికారాలను కట్టబెట్టింది.. తెలంగాణలోని గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మెడికల్ కాలేజీలు.. జిల్లా ఆస్పత్రుల వరకు ప్రక్షాళన చేయాలని కేసీఆర్ ఆదేశించారు. అన్ని రకాల మందులను ఆస్పత్రుల్లోనే ఉచితంగా ఇవ్వాలని స్పష్టం చేశారు. రోగ నిర్ధారణ పరీక్షలకు పేదలను బయటకు పంపకుండా ఆస్పత్రుల్లోనే చేసేలా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగాన్నికి ప్రాధాన్యం ఇస్తోందని.. పేదలకు ఉచితంగా వైద్యం అందించడమే కర్తవ్యమని కేసీఆర్ అన్నారు.