
సికింద్రాబాద్ , ప్రతినిధి : తెలంగాణలో విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్..స్కాలర్ షిప్ ల సమస్యలపై విద్యార్థులు గళమెత్తుతున్నారు. మంత్రి పద్మారావు ఇంటి వద్ద మంగళవారం ఉదయం టెన్షన్..టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు మంత్రి నివాసాన్ని ముట్టడించారు. పీడీఎస్ యు ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఎత్తున ఇంటిని ముట్టడించారు. పెండింగ్ స్కాలర్ షిప్..ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్కడనే మోహరించిన పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళా విద్యార్థులని చూడకుండా లాక్కొళ్లి వ్యాన్ లో పడేశారు.