Breaking News

మంత్రి జగదీష్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ లు

మంత్రి జగదీష్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ లు

బుధవారం జన్మ దినోత్సవం జరుపుకుంటున్న రాష్ట్ర విద్యుత్, యస్ సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి రాష్ట్ర గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రి కేసీఆర్ లు వేరు వేరు గా శుభాకాంక్షలు తెలియజేశారు. తన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం ఎర్రవల్లి లోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన మంత్రి జగదీష్ రెడ్డి కి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు అందజేశారు. అదే విదంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంత్రి జగదీష్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపారు. అదే విదంగా బోనగిరి యాదాద్రి జిల్లా లో జరిగిన జన్మదినోత్సవ వేడుకల్లో శాసనమండలి సభ్యులు ఎలిమినేటి కృషారెడ్డి ,శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ఫైళ్ల శేఖర్ రెడ్డి ,గొంగడి సునీతా మహేందర్ రెడ్డి లతో పాటు స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి జగదీష్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి అద్వర్యంలో జరిగిన వేడుకల్లో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ , శాసన మండలి సభ్యులు పుల రవీందర్ , నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం,మునుగోడు శాసన సభ్యులు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ,మిర్యాలగూడెం శాసనసభ్యులు భాస్కర్ రావు ,దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ తదితరులు హాజరయ్యారు అదే విదంగా సూర్యపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు ,టి ఆర్ యస్ పార్టీ నాయకులు ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామలలో సూర్యపేట పట్టణంలో నీ అన్ని వార్డులలో ఘనంగా నిర్వహించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *