
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ లో టీఆర్ఎస్ ను గెలిపించిన కేటీఆర్ కు కేసీఆర్ మున్సిపల్ శాఖను అప్పగించిన సంగతి తెలిసిందే.. ఆ తరువాత హైదరాబాద్ పరిపాలన బాధ్యతలను కేటీఆర్ భుజానికెత్తుకున్నాడు. సంస్కరణలు ప్రవేశపెట్టాడు. దీంతో పాటు ఆన్ లైన్ సేవలను కూడా కేటీఆర్ జీహెచ్ఎంసీలో ప్రవేశపెట్టాడు.
ఈ సందర్భంగా విశాల్ తులి అనే యువకుడు తమ కాలనీలో చెత్త ఎత్తడం లేదని కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో స్పందించిన కేటీఆర్ గంటలోనే ఆ చెత్తను ఎత్తివేయించి పూర్తిగా తొలగించారు. కాగా తక్షణం స్పందించిన కేటీఆర్ కృతజ్ఞతకు మళ్లీ యువకుడు చెత్తను తొలగించి నీట్ గా మార్చిన ఫొటోను కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి సత్వరం స్పందించిన మంత్రి కేటీఆర్ కు సాల్యూట్ అని ట్వీట్ చేసి అభినందించడం గమనార్హం.