మంత్రి కేటిఆర్ కు స్టాన్‌పోర్డ్ యూనివర్సీటీ అహ్వనం

KT RAMARAO

 

 

 

  • స్టాన్‌పొర్డ్ యూనివర్సీటీ వార్షిక సమావేశంలో కీలోపన్యాసం చేయాల్సిందిగా మంత్రిని కోరిన యూనివర్సీటీ
  • తెలంగాణ ప్రగతి, టెక్నాలజీ అధారంగా ఉద్యోగాలు, ఏంటర్ పెన్యూర్ షిప్ ప్రోత్సాహం వంటి అంశాల పై మంత్రి ప్రసంగం
  • నూతన భారతదేశ ప్రతినిధిగా మంత్రిని అభివర్ణించిన స్టాన్ పొర్డ్ యూనివర్సీటీ
  • వరుసగా రెండో ఎడాది మంత్రికి అహ్వనం
  • మేనెల 18-19 తేదిల్లో జరగనున్న స్టాన్ పొర్డ్ వార్షిక కాన్పరెన్సు
  • యూనివర్సీటీ అహ్వనం పట్ల మంత్రి హర్షం

 

పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావుకు స్టాన్‌పోర్డ్ యూనివర్సీటీ నుంచి అహ్వనం లభించింది. స్టాన్‌పొర్డ్ యూనివర్సీటీ వార్షిక  సదస్సులో  కీలోపన్యాసం చేయాల్సిందిగా మంత్రిని యూనివర్సీటీ కోరింది. ఈ ఏడాది మే నెలలో 18-19 తేదిల్లో జరిగే ఈ సమావేశంలో ఉపాది-ఉద్యోగాలు, ఎంటపెన్యూర్ షిప్ అంశాల మీద మంత్రి ప్రసంగించాల్సిందిగా కోరింది. ఐటి రంగంలో గత రెండున్నర సంవత్సరాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ, టెక్నాలజీ వినియోగం ద్వారా ఉద్యోగాలను, ఎంటర్ ప్రెన్యూర్ షిప్‌ను ప్రొత్సహించేందుకు ఉన్న అవకాశాలపైన మాట్లాడాలని కోరింది. ఈ సమావేశానికి స్టాన్‌పొర్డ్ విద్యార్దులు, ప్యాకల్టీతోపాటు వివిధ దేశాల నుంచి పరిశ్రమల ప్రతినిధులు సైతం హజరవుతారని, వీరందరికి తెలంగాణ సాధించిన ప్రగతి ఒక కేస్ స్టడీగా ఉపయోగపడే అవకాశం ఉందని యూనివ్సరీటీ  మంత్రికి పంపిన లేఖలో తెలిపింది.  నూతన భారతదేశానికి ప్రతినిధిగా మంత్రి ఉన్నారంటూ మంత్రికి పంపిన ప్రత్యేక అహ్వనంలో స్టాన్‌పొర్డ్  ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ సెంటర్ డైరెక్టర్ అంజిని కోచ్చార్ తెలిపారు. గత ఎడాది సైతం మంత్రికి స్టాన్‌పొర్డ్ నుంచి అహ్వనం లభించింది. వరుసగా రెండో ఏడాది తనకు అహ్వనం రావడం పట్ల మంత్రి కెటి రామారావు హర్షం వ్యక్తం చేశారు.

 

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *