
తెలంగాణ రాష్ర్టం , అస్ట్రేలియా మద్య వ్యాపార, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నం మరింత జరగాలని మంత్రి కెటి రామారావు అన్నారు. ఈరోజు సచివాలయంలో మంత్రి కార్యాలయంలో అస్ర్టేలియా కాన్సుల్ జనరల్ షాన్ కెల్లీ, ఇండియా ఏకానామిక్ స్ర్టాటేజీ( ప్రాజెక్టు లీడర్) పీటర్ వర్గీస్లతో కూడిన ప్రతినిధి బృందం ఈ రోజు కలిసింది. విద్య, వ్యవసాయం, టూరిజం వంటి రంగాల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రికి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాధాన్యతారంగాలను చర్చించిన ప్రతినిధి బృందం, తెలంగాణలోకి అస్ర్టేలియన్ పెట్టబడులు వచ్చేందుకు సహాకరిస్తామని తెలిపారు. తెలంగాణలో ఉన్న మైనింగ్ అవకాశాల నేపథ్యంలో క్వీన్స్ లాండ్ యూనివర్సీటీతో మైనింగ్ యూనివర్సీటి ఏర్పాటును పరిశీలిస్తామని ప్రతినిధి బృందం తెలిపింది. అస్ట్రేలియాతో విద్య, పుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ రంగాల్లో తెలంగాణలో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తే పూర్తి సహాకారం అందిస్తామని మంత్రి కెటి రామారావు వారికి తెలిపారు.