Breaking News

మంత్రి కార్యాలయంలో భవన, ఇతర నిర్మాణ కార్మిక మండలి సమావేశం

మంత్రి కార్యాలయంలో భవన, ఇతర నిర్మాణ కార్మిక మండలి సమావేశం

సచివాలయంలోని రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి కార్యాలయంలో శనివారంనాడు భవన, ఇతర నిర్మాణ కార్మిక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయెల్ , కార్మిక శాఖ కమీషనర్ అహ్మద్ నదీం, బోర్డు కార్యదర్శి రవీందర్ రెడ్డి మరియు బోర్డు సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో నూతన వృత్తులలో నైపుణ్యాభివృద్ది శిక్షణ కొరకై శిక్షణా సంస్థలను ఎంపిక చేయడంపై చర్చ జరిగింది. దీనిలో బాగంగా ఫాల్ సీలింగ్ , మార్బుల్ ఫ్లోరింగ్ , ఉడెన్ వర్క్స్ వంటి వృత్తులలో కార్మికులకు శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించారు. త్వరలో మరికొన్ని సంక్షేమపథకాలను కార్మికుల కోసం ప్రవేశపెట్టాలని నిశ్చయించారు. కార్మికులకు సమగ్ర ఆరోగ్య పథకం క్రింద వివిధ సౌకర్యాలను కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. “ఆరోగ్య శ్రీ పథకం” అధికారులతో చర్చించి విదివిదానాలను రూపొందించాలని బోర్డు అభిప్రాయపడింది. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కార్మికులకు అందించే ఆర్దిక సహాయాన్ని మరికొంత పెంచాలని సూత్రప్రాయంగా అంగీకరించారు. సమావేశంలో బోర్డు సభ్యులు గంధం ఆంజనేయులు, పద్మ శ్రీ , వేణుగోపాల్ రెడ్డి, రాజశేఖర్ లు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *